అయిదు సినిమాలతో 2021కి సిద్ధమవుతున్న నేచురల్ స్టార్

“కృష్ణార్జున యుద్ధం, దేవదాసు, జెర్సీ, గ్యాంగ్ లీడర్” వంటి వరుస పరాజయాలతో గత రెండేళ్లుగా నాని కాస్త నెమ్మదించాడు కానీ.. అంతకు ముందు వరకు ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదల చేసి బ్లాక్ బస్టర్ హీరోగా ఉండేవాడు నాని. నిర్మాతగానూ “అ!, హిట్” సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్న నాని కెరీర్ కి 2020 పెద్ద బ్రేక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “వి” తప్ప నానికి 2020లో ఒక్క విడుదల కూడా లేదు.

ఈ గ్యాప్ ను 2021లో ఫిల్ చేసేయాలని చూస్తున్నాడు నాని. నటుడిగా, నిర్మాతగా కలగలిపి 2021లో మొత్తం అయిదు సినిమాలు విడుదల చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు నేచురల్ స్టార్. ఆల్రెడీ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “టక్ జగదీశ్” రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. జనవరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలనీ ప్లాన్ ఉంది. అలాగే.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి” మరియు మరో సినిమా కూడా 2021లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని.

అలాగే “హిట్ 2″తోపాటు ఇంకో సినిమాని కూడా నిర్మించి 2021లోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇలా 5 సినిమాలతో 2021కి శుభారంభం పలుకుతున్నాడు నాని. మిగతా మీడియం బడ్జెట్ హీరోలు కూడా నాని ఫార్ములాను ఫాలో అయితే.. ఇండస్ట్రీ మళ్ళీ ఊపందుకుంటుంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus