టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనారోగ్యంపాలై గత నెల నవంబర్ 30న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన లేరు అనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో సినీ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చివరిగా నాని ‘శ్యామ్ సింగ రాయ్’ లో ఓ పాట రాసారు. ఈ విషయాన్ని చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఆ పాట ‘సిరివెన్నెల’ పేరుతోనే రూపొందడం మరో విశేషం.
ఇక ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం ఈ శుక్రవారం నాడు అనగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని పాల్గొన్నారు. ఈ క్రమంలో నాని సిరివెన్నెల గారి గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నాని మాట్లాడుతూ.. ” సిరివెన్నెల గారు మా సినిమాకి పాట రాయడం ఆదీ ఆయన చివరి పాట అవ్వడం మాకు ఎమోషనల్ కనెక్ట్ అయింది.
‘ఇది నా చివరి పాట అవుతుందేమో’ అని సిరివెన్నెల గారు రాహుల్ తో అన్నారట. తర్వాత ఓరోజు ఆ విషయాన్ని రాహుల్ నాకు చెప్పాడు. కానీ నిజంగానే అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ ఒక్క పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు సిరివెన్నెల గారు.ఈ పాటని ఎంత మంది విన్నారో తెలీదు. ఈసారి అబ్సర్వ్ చెయ్యండి.. తర్వాత సినిమా చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు.
ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన ‘శ్యామ్ సింగ రాయ్’ కి రాయడం అనేది వరం. ఆయన్ని మా ఇంటికి వచ్చిన గెస్ట్ గా సాగనంపాల్సిన బాధ్యత మా పై ఉంది.ఇది మాకు చాలా ఎమోషనల్ ఎలిమెంట్. ఆయనకి నివాళిగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది” అంటూ నాని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!