నేచురల్ స్టార్ నాని.. ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. ‘దసరా’ పై నాని చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే అతని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అందుకే ‘దసరా’ కి బ్లడ్ పెట్టి మరీ పనిచేశాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో నానికి చాలా గాయాలు అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా పనిచేశాడు. అయితే నాని నటించిన గత 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాయి. ఎంత కలెక్ట్ చేశాయి వంటి విషయాలను ఓ లుక్కేద్దాం రండి :
1) మజ్ను :
నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2016 సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.15.08 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.0.92 కోట్ల స్వల్ప నష్టాలతో అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..
2) నేను లోకల్ :
నాని హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20.1 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.33.2 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.13.1 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
3) నిన్ను కోరి :
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017 జూలై 7న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.28.56 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.8.56 కోట్ల లాభాలతో బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది.
4) ఎం.సి.ఎ(మిడిల్ క్లాస్ అబ్బాయ్) :
నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2017 డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.39.84 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.9.84 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
5) కృష్ణార్జున యుద్ధం :
నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018 ఏప్రిల్ 12న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.14.49 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.13 కోట్ల వరకు నష్టాలను మిగిల్చి డిజాస్టర్ అయ్యింది.
6) దేవదాస్ :
నాని, నాగార్జున కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2018 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.25.37 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. రూ.12 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
7) జెర్సీ :
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019 ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.28.25 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.1.25 కోట్ల లాభాలతో హిట్ మూవీ అనిపించుకుంది.
8) నానీస్ గ్యాంగ్ లీడర్ :
నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019 సెప్టెంబర్ 13న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.21.14 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.6.86 కోట్ల నష్టాలతో ప్లాప్ గా మిగిలింది.
9) శ్యామ్ సింగ రాయ్ :
నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.26.3 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.4.3 కోట్ల లాభాలతో హిట్ మూవీ అనిపించుకుంది.
10) అంటే సుందరానికీ! :
(Nani) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2022 జూన్ 10న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.21.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. రూ.9.08 కోట్ల నష్టాలతో ప్లాప్ గా మిగిలింది.