Nani: నాని లైన్‌లో మార్పులు.. మరో ప్రాజెక్ట్ ఆగిందా?

Ad not loaded.

నేచురల్ స్టార్ నాని (Nani)  తన సినిమాల ఎంపికతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన మార్కెట్‌ను సెట్ చేసుకున్నాడు. వరుసగా వచ్చిన దసరా Dasara) , హాయ్ నాన్న (Hi Nanna) , సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టి నాని క్రేజ్‌ను మల్టీపుల్‌గా పెంచాయి. ఇప్పుడు నాని టార్గెట్ నేరుగా పాన్ ఇండియా రేంజ్‌లోకి వెళ్లడమే. అందుకే తన లైనప్‌లో పర్‌ఫెక్ట్ డైరెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 (HIT3)  మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రారంభించిన ఈ హిట్ (HIT) ఫ్రాంచైజీ ఇప్పుడు నానికి వచ్చింది.

Nani

ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటంతో, నాని పాన్ ఇండియా రేంజ్‌లో మరింత బలంగా నిలుస్తాడనే అంచనాలు ఉన్నాయి. కంటెంట్ పరంగా పక్కా ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని టాక్. ఇక దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో (Srikanth Odela) నాని ది ప్యారడైజ్ అనే మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా హై బడ్జెట్‌తో రూపొందుతుండటంతో, నాని మార్కెట్ మరింత పెరుగుతుందనే ఆశలు ఉన్నాయి. అయితే నాని లైనప్‌లో మరో యువ దర్శకుడు సుజిత్ (Sujeeth)  ప్రాజెక్ట్ కూడా ప్లాన్‌లో ఉండేది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  OG (OG Movie) పూర్తయిన తర్వాత సుజిత్, నాని కోసం ఒక మాస్ యాక్షన్ కథను ప్రిపేర్ చేశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం, సుజిత్ ప్రాజెక్ట్ కొంతకాలం హోల్డ్‌లో పడిందని తెలుస్తోంది. సుజిత్ చెప్పిన కాన్సెప్ట్ నానికి చాలా నచ్చినా, బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదట. నాని ఎలాగైనా ఆ సినిమా చేయాలనుకున్నప్పటికీ, ఫైనల్‌గా అది సెట్టవ్వలేదు. ఈలోగా నాని లైనప్‌లో శేఖర్ కమ్ముల  (Sekhar Kammula)  ఎంట్రీ ఇచ్చాడు. కమ్ముల చెప్పిన కొత్త కథ నానికి బాగా నచ్చిందని టాక్.

ప్రస్తుతం కమ్ముల ధనుష్‌తో (Dhanush) పాన్ ఇండియా మూవీ కుబేర (Kubera)  చేస్తుండటంతో, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే నానితో సినిమా పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. కమ్ముల న్యాచురల్ స్టోరీలతో ఆడియన్స్‌ను మెప్పించడంలో దిట్ట. కాబట్టి నాని-కమ్ముల కాంబోపై ఇప్పటికే టాలీవుడ్‌లో బిగ్ హైప్ ఏర్పడింది. ఇక సుజిత్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో జరుగుతుందా? లేక పూర్తిగా క్యాన్సిల్ అవుతుందా? అనేది చూడాలి. కానీ ఇప్పుడు నాని-కమ్ముల కాంబోపై ఫోకస్ మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారిక ప్రకటన కూడా త్వరలో రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

SSMB29: ప్రియాంక క్యారెక్టర్ పై క్రేజీ లీక్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus