Nani, Rajinikanth: నానికి బ్యాడ్ లక్.. శర్వానంద్ కి గోల్డెన్ ఛాన్స్..!

‘జైలర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రజినీకాంత్.. తన తర్వాత సినిమాని ‘జై భీమ్’ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా.. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో నానిని అప్రోచ్ అవ్వడం జరిగింది. నానికి తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకి ఓకే చెప్పేసినట్టు టాక్ నడించింది.

‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు నాని. ‘దసరా’ సినిమాకి కూడా అక్కడ మంచి రివ్యూలు వచ్చాయి. అయితే రజినీకాంత్ సినిమా నుండి నాని ఊహించని విధంగా తప్పుకున్నట్టు తాజా సమాచారం. అందుకు కారణాలు ఏంటి అన్నది తెలీదు. ఇప్పుడు నాని ప్లేస్ లో శర్వానంద్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ తో కలిసి నటించడం అంటే శర్వానంద్ కి గోల్డెన్ ఛాన్స్ లాంటిది అనే చెప్పొచ్చు.

పైగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ రకంగా (Nani) నానికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పాలి. శర్వానంద్ కి మాత్రం గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. గతంలో శర్వానంద్ ‘జర్నీ’ ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులను కూడా అలరించాడు. తమిళంలో ఎంతో కొంత ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా శర్వానంద్ నిలిచాడు. రజినీ సినిమాతో అక్కడ అతనికి ఇంకా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus