Nani: నాని ఉంటే బ్లాస్ బస్టర్ పక్కా.. ఎంతమందిని పరిచయం చేశాడంటే..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోలెందరో ఉన్నా, ప్రతి సినిమా కొత్తదనంతో పాటు కొత్త దర్శకులను ప్రోత్సహించేవాళ్లు తక్కువ. కానీ నాని (Nani) మాత్రం ఈ విషయంలో ప్రత్యేకమైన హీరో. అతను కేవలం ఓ స్టార్‌గా మాత్రమే కాకుండా, ఇండస్ట్రీకి మంచి కథలను అందించే వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు క్లాస్, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథలను ఎంచుకున్న నాని, ఇప్పుడు మరింత విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటూనే, ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నాడు.

Nani

హీరోగా ‘దసరా’ (Dasara) , ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాలతో రెండు విభిన్న జోనర్లను ఎంచుకుని హిట్ కొట్టిన నాని, తాజాగా నిర్మాతగా ‘కోర్ట్’ (Court) సినిమాతో మరోసారి తన ట్రెండ్‌ను కొనసాగించాడు. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలు లేకుండానే బ్లాక్‌బస్టర్‌గా మారింది. తెలుగు ఇండస్ట్రీలో కోర్ట్ డ్రామాలు కొన్ని వచ్చినా, ‘కోర్ట్’ మాత్రం ప్రేక్షకుల మనసులను తాకేలా రూపొందింది. ఇది కేవలం కథకు మాత్రమే కాకుండా, నాని నిర్మాణంలో పెట్టిన నమ్మకానికి వచ్చిన విజయంగా చెప్పొచ్చు.

నాని గతంలో ‘అ!’ (Awe) ద్వారా ప్రశాంత్ వర్మను (Prasanth Varma), హిట్ తో (HIT) శైలేష్ ను (Sailesh Kolanu), నిన్ను కోరి (Ninnu Kori) తో శివ నిర్వాణను (Shiva Nirvana),, ‘దసరా’తో శ్రీకాంత్ ఒదేలాను (Srikanth Odela)  ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అలాగే అలా మొదలైందితో (Ala Modalaindi) నందిని రెడ్డి (Nandini Reddy), ఎవడే సుబ్రహ్మణ్యం తో (Yevade Subramanyam) నాగ్ అశ్విన్ (Nag Ashwin), హాయ్ నాన్నతో శౌర్యవ్ (Shouryuv) వంటి దర్శకులు కూడా నాని సపోర్ట్ తోనే మొదలయ్యారు. ఇప్పుడు ‘కోర్ట్’ సినిమాతో రామ్ జగదీశ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, మరో కొత్త దర్శకుడికి అవకాశం కల్పించాడు.

టాలీవుడ్‌లో ఇలాంటి హీరోలు కొందరే ఉంటారు, వీరి సినిమాలంటే ప్రేక్షకులకు కూడా ఓ నమ్మకం ఏర్పడుతుంది. నాని ప్రత్యేకత ఏమిటంటే, ఆయన చేస్తున్న సినిమాలు వేరే జోనర్‌లో ఉంటాయి. మాస్, క్లాస్ అనే పరిమితులు పెట్టుకోకుండా, తన మార్కెట్‌ను అలాగే కొనసాగించుకుంటూనే, కొత్త ప్రయోగాలకు తన బ్యానర్‌ను అంకితం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇండస్ట్రీకి మంచి కొత్త దర్శకులు అందించాలనే ఉద్దేశంతో, కమర్షియల్‌గా విజయవంతమైన కథలను ఎంచుకుంటూ నానీ తనదైన మార్క్‌ను కొనసాగిస్తున్నాడు.

వరుస హిట్స్ ను చూస్తే, నాని సినిమా అంటే ప్రేక్షకులు ఒక నమ్మకంతో థియేటర్లకు వెళతారు. ఒకప్పుడు అతను హిట్స్ అందుకుంటే చాలు అనుకునే ఫేజ్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు నాని ఏ సినిమా తీసినా, అది బ్లాక్‌బస్టర్ కాని ప్రాజెక్ట్‌ అవుతుందనే స్థాయికి చేరుకున్నాడు. టాలీవుడ్‌కు కొత్త ప్రయోగాలను అందిస్తున్న నాని, ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తే, ఇంకెంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఇండస్ట్రీలోకి రావడానికి అవకాశం ఉంటుంది.

రావిపూడి ప్లాన్ రెడీ.. అనుకున్నట్లే చిరు టార్గెట్ ఫిక్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus