Nani, Rajinikanth: మరో క్రేజీ ప్రాజెక్టులో భాగం కానున్న నాని..!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ‘అంటే సుందరానికీ!’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ‘జైలర్’ తర్వాత రజినీకాంత్.. ‘జై భీమ్’ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తో ఓ సినిమా చేయబోతున్నారు.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం నానిని అప్రోచ్ అవ్వడం జరిగిందట. నానికి తన పాత్ర నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. గతంలో నాని ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా తమిళ వెర్షన్లో చిన్న అతిథి పాత్ర పోషించాడు. అలాగే తమిళ దర్శకుడు సముద్రఖనితో ‘జెండా పై కపిరాజు’ అనే సినిమా చేశాడు.

అవి సక్సెస్ కాలేదు. అందుకే తమిళ జనాలకి (Nani) నాని దగ్గరవ్వలేకపోయాడు. ‘దసరా’ కూడా తమిళంలో పెద్దగా కలెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు రజినీకాంత్ తో పనిచేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి.. తమిళ జనాలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నాని ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.నాని కూడా రజినీకాంత్ కి వీరాభిమాని అని చెబుతూ ఉంటాడు. ‘జెంటిల్ మన్’ వంటి సినిమాల్లో రజినీకాంత్ ను ఇమిటేట్ చేశాడు కూడా..!

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus