Nikhil, Swathi: ఆ ఒక్క కారణంతోనే అనుపమను తీసుకున్నాము!

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ. ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్ కలర్ స్వాతి జంటగా నటించారు. ఇక ఈ సినిమా విడుదల ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కలర్స్ స్వాతికి బదులుగా అనుపమ పరమేశ్వరన్ నటించారు.కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి తన క్యూట్ నెస్ తో ఎంతో అద్భుతంగా నటించి అందరిని ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో కలర్స్ స్వాతి కాకుండా అనుపమను తీసుకోవడానికి గల కారణాలు గురించి పెద్ద ఎత్తున నేటిజెన్లు ఆరా తీసారు. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిఖిల్ కి ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా నిఖిల్ కార్తికేయ 2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించడానికి, కలర్స్ స్వాతి నటించకపోవడానికి కారణాలు తెలిపారు.

ఈ సినిమాలో హీరోయిన్ నార్త్ ఇండియన్ అమ్మాయిల కనిపించాల్సి ఉంటుంది కానీ కలర్స్ స్వాతి ఈ పాత్రకు సెట్ కాదన్న ఒకే ఒక కారణంతో కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ఎంపిక చేశారని ఈ సందర్భంగా నిఖిల్ వెల్లడించారు. ఈ విధంగా కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా

కరోనా వల్ల వాయిదా పడుతూ రావడమే కాకుండా ప్రస్తుతం ఈయన సినిమా విడుదలకు థియేటర్లు దొరకపోవడంతో మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. అదృష్టవశాత్తు సినిమా థియేటర్లు దొరకటం వల్ల ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus