Nithiin: నితిన్‌ ‘మాచర్ల…’ కథ ఇదేనంట..!

టాలీవుడ్‌లో కలెక్టర్‌ కథల ట్రెండ్‌ మొదలవబోతోందా? యంగ్‌ హీరోల సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పటికే ‘రిపబ్లిక్’ పేరుతో సాయిధరమ్‌ తేజ్‌ఓ సినిమా చేశాడు. అందులో అతను కలెక్టర్‌ పంజా అభిరామ్‌గా కనిపిస్తాడు. అయితే మరో హీరో కూడా కలెక్టర్‌ అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అతనే నితిన్‌. నితిన్‌ 31వ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అందులోనే నితిన్‌ కలెక్టర్‌గా కనిపిస్తాడట. ఎడిటర్‌గా సుపరిచితుడు అయిన శేఖర్‌ aka ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’.

ఈ సినిమాలో నితిన్‌ మాస్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌, లుక్‌తోనే తెలిసిపోయింది. అయితే ఈ సినిమాలో అతను కలెక్టర్‌గా కనిపిస్తాడనేది లేటెస్ట్‌ సమాచారం. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వెళ్లిన నితిన్‌… అక్కడి సమస్యల్ని ఎలా ఎదుర్కొని నిలిచి, అక్కడివారికి న్యాయం చేశాడనేదే కథ అట. ఈ కలెక్టర్‌ కథకు శేఖర్ మంచి లవ్‌ స్టోరీని కూడా మిక్స్‌ చేశాడని అంటున్నారు.

సినిమా పేరుతో ‘వైవిధ్యంగా ఉంది’ అనే టాక్‌ సంపాదించిన నితిన్‌ అండ్‌ టీమ్‌. మరి సినిమాను ఎలా తీర్చిదిద్దుతుందో చూడాలి. అన్నట్లు నితిన్‌ త్వరలో ‘మాస్ట్రో’ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఏం చేస్తుందో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus