‘భీష్మ’ తర్వాత నితిన్ నటించిన సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు. ‘చెక్’ డిజాస్టర్ అయ్యింది. ‘రంగ్ దే’ జస్ట్ యావరేజ్ గా మిగిలింది. ‘మాస్ట్రో’ ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యింది. ‘మాచర్ల నియోజకవర్గం’ అయితే పెద్ద ప్లాప్ గా మిగిలింది. అంతేకాకుండా నితిన్ స్టోరీ సెలక్షన్ పై కూడా విమర్శలు కురిపించేలా చేసింది అని చెప్పాలి. దీంతో తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నితిన్.
కృష్ణ చైతన్య డైరెక్షన్లో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టేసి.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాడు. కొంత షూటింగ్ అయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేయించాడు. ఇది నితిన్ కు 32 వ చిత్రం. ‘ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్’ ‘శ్రేష్ఠ్ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ ను పరిశీలించారు కానీ ఇప్పుడు ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
‘ఆర్డినరీ మెన్ ‘ అనేది దీని ఉపశీర్షిక. అయితే ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడట. దీంతో నితిన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఏ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా సక్సెస్ అందుకోలేదు. ‘ఘర్షణ'(2004 ) మాత్రం యావరేజ్ అనిపించుకుంది. పైగా ఇప్పుడు హారిస్ జైరాజ్ ఫామ్లో కూడా లేడు. అందుకే నెటిజన్లు కూడా ‘ఈ టైంలో అలాంటి రిస్క్ లు అవసరమా (Nithiin) నితిన్ ‘ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్