ప్రపంచాన్ని కరోనా మెలమెల్లగా కబళిస్తోంది. ప్రజలను ఈ మహమ్మారి బారి నుండి కాపాడుకోవడానికి ప్రపంచదేశాల నాయకులు, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ వైరస్ ప్రబలుతూనే ఉంది. అయితే.. ఈ సమయంలో ఫండ్స్ పెద్ద సమస్యగా మారతాయి. ప్రభుత్వాలు ఎంత బడ్జెట్ సమకూర్చినా కూడా లోటు బడ్జెట్టే అవుతుంది. ఇటలీ, చైనా వంటి దేశాల్లో బిలియనీర్లందరూ ముందుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు డొనేట్ చేసి తమ ధాతృత్వాన్ని చాటుకొన్నారు. అయితే.. ఇండియాలో మాత్రం ఇంకా ఎవరూ ఈ కోణంలో ముందడుగు వేయలేదు.
నిన్న సాయంత్రం నితిన్ ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఈమేరకు మిగతా హీరోలు కూడా ముందుకొచ్చి రాష్ట్రానికి చేయూతనిచ్చి.. తాము రీల్ హీరోలు మాత్రమే కాదని, రియల్ లైఫ్ హీరోలు కూడా అని ప్రూవ్ చేసుకుంటారో లేక ట్వీట్లు, ఇన్స్టాగ్రమ్ వీడియోలకు పరిమితమవుతారో చూడాలి. అప్పట్లో హుద్ హుద్ సమయంలోనూ ముందు రామ్ చరణ్ విరాళం ప్రకటించారు. ఆ తర్వాత అందరూ క్యూ కట్టారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సినిమా ఇండస్ట్రీ నుండి కోట్ల రూపాయల సాయం అందితే బాగుండు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా భారీ స్థాయిలో లేనప్పటికీ.. భవిష్యత్ లో భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ సమయంలో ఈ ఫండ్స్ బాగా ఉపయోగపడతాయి.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్