దీపావళికి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘క’ (KA) ‘బఘీరా’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారానికి ఒక పెద్ద సినిమా అన్నట్టు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 14న సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) రిలీజ్ అవుతుంది. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 14న రిలీజ్ అయ్యే సినిమాల్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ‘కంగువా’ అనే చెప్పాలి. అయితే అదే డేట్ కి వరుణ్ తేజ్ (Varun Tej) ‘మట్కా’ (Matka) కూడా రిలీజ్ కాబోతుంది.
మొదట ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులకి అంచనాలు లేవు. అయితే ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంది. అందువల్ల సెకండ్ ఆప్షన్ ‘మట్కా’ గా ఉంటుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. రాకపోయినా ‘కంగువా’ కి ఎక్కువ టికెట్లు తెగుతాయి. ‘మట్కా’ కి హిట్ టాక్ వచ్చినా సెకండ్ ప్లేస్ లోనే ఉంటుంది. అయితే నవంబర్ 14నే మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) కూడా రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకుడు. గతంలో అతను ‘గుణ 369’ అనే సినిమాని తెరకెక్కించాడు. అయితే కథ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) అందించాడు. అందువల్లే కాబోలు.. ‘దేవకీ నందన వాసుదేవ’ కి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందట. దాదాపు రూ.7 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు సమాచారం. అయితే హిట్ టాక్ వచ్చినా.. పోటీలో ఈ సినిమా నెగ్గుకురాగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.? ప్రస్తుతానికి ఈ సినిమాపై బజ్ అయితే లేదు. టీజర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయితే ఏమైనా బజ్ ఏర్పడొచ్చు.