అక్కడ మార్కెట్‌ ఉండటం నా అదృష్టం: రామ్

రామ్‌కు దూకుడు ఎక్కువ… సినిమాల్లో అతని క్యారెక్టర్లు, వాటి క్యారెక్టరైజేషన్లు చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. అవి ప్రేక్షకులకు ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘రెడ్‌’ కూడా బాక్సాఫీసు మంచి ఫలితాన్నే ఇచ్చిందంటున్నారు. ఈ సినిమా డబ్బింగ్‌ వెర్షన్‌ను ఇతర భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అలా హిందీలోకి కూడా వెళ్తోంది. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. రామ్‌ సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లకు బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది.

రామ్‌ నటించిన గత చిత్రాల డబ్బింగ్‌ వెర్షన్లను హిందీ జనాలు యూట్యూబ్‌లో తెగ చూసేశారు. అందుకే రామ్‌ కొత్త సినిమా కూడా బాలీవుడ్‌ పంపిస్తున్నారు. అంతేకాదు రామ్‌ బాలీవుడ్‌కి వెళ్తాడు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇటీవల జాన్‌ అబ్రహంతో ఓ యాడ్‌లో కూడా నటించడం గాసిప్స్‌కు బలం చేకూర్చినట్లయింది. తాజాగా రామ్‌ ఆ పుకార్ల విషయంలో స్పందించాడు. ‘‘నాకు హిందీలో మార్కెట్ ఉండటం అదృష్టమే. కానీ ఇప్పట్లో బాలీవుడ్‌లో అడుగుపెట్టే ఆలోచన లేద’’ని చెప్పేశాడు’’.

రామ్‌ ఇలా అంటున్నాడే కానీ.. బాలీవుడ్‌లోనూ తన పాగా వేయాలనే ఆలోచన ఉన్నాడని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే దీని కోసం కథలు వింటున్నాడని అంటున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవకొండ ‘ఫైటర్‌’తో పాన్‌ ఇండియా సినిమా చేస్తుండటం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌కి వెళ్తుండటంతో.. రామ్‌ కూడా ఆ దారిలోనే ఆలోచిస్తున్నాడట. అయితే సరైన కథ, దర్శకుడు దొరికాక బాలీవుడ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus