ఒక కప్ కాఫీ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి. ఎంత 7 స్టార్ హోటల్లో అయినా మహా అయితే ఒక రెండొందలు లేదా మూడొందలు ఉంటుంది. మరీ ఏదైనా విదేశంలోని కాస్ట్లీయస్ట్ హోటల్ కి వెళ్తే ఒక 1000 రూపాయలు ఉండొచ్చేమో. కానీ.. మన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తన ప్రస్తుత సినిమా “ఇస్మార్ట్ శంకర్” దర్శకుడైన పూరీ జగన్నాధ్ కి ప్రపంచలోనే కాస్ట్లీయస్ట్ కాఫీ పౌడర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. కేవలం 10 గ్రాముల పొడి దాదాపుగా 2500 రూపాయలు ఉండే ఈ కాఫీ పౌడర్ ప్యాకెట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు రామ్.
ఈ విషయాన్ని పూరీ తన ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేయగా.. వెంటనే రామ్ దానికి స్పందిస్తూ.. పొరపాటున కూడా రేట్ ఎంత అని గూగుల్ చేయకండి అని మరో ట్వీట్ వేశాడు. ఇక హీరోయిన్ నభ నటేష్ “మారి నాకు లేదా?” అని అడగ్గా.. షూటింగ్ కి వచ్చేయ్ అని సమాధానం ఇచ్చాడు పూరీ జగన్నాధ్. గతంలో “ఇద్దరమ్మాయిలతో” షూటింగ్ టైమ్ లో పూరీకి ఒక డైమెండ్ లైటర్ గిఫ్ట్ గా ఇచ్చాడు బండ్ల గణేష్. అయితే.. ఈ కాఫీ పొడిని ఒక స్పెషల్ జాతికి చెందిన పిల్లి మల విసర్జన నుండి తయారు చేస్తారట.