Ram, Balakrishna: రామ్ విషయంలో బోయపాటి అలా చేస్తున్నారా?

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టార్ హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు అంచనాలకు మించి విజయాలను సాధించి బాలయ్య బోయపాటి శ్రీను కాంబో అంటే బ్లాక్ బస్టర్ కాంబో అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలగజేశాయి. అయితే బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించడం గమనార్హం. ఈ మూడు సినిమాలలో హీరో పోషించిన రెండు పాత్రలు ఒకే కుటుంబానికి చెందిన పాత్రలు కావడం గమనార్హం.

అయితే రామ్ సినిమా విషయంలో బోయపాటి శ్రీను ఇదే ఫార్ములాను వాడబోతున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో బాలయ్య బాటలో రామ్ నడవనున్నారని తెలుస్తోంది. రెడ్ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే బోయపాటి శ్రీను హీరోను రెండు పాత్రల్లో చూపించినా రెండు పాత్రల మధ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. అఖండ సక్సెస్ తో జోరుమీదున్న బోయపాటి శ్రీను రామ్ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.

రామ్ తన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. క్రేజ్ ఉన్న హీరోయిన్లు తన సినిమాలలో నటించేలా రామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. రామ్ నటించిన ది వారియర్ ఈ నెల 14వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

తమిళంలో కూడా ఈ సినిమాపై భారీస్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ది వారియర్ సినిమాతో రామ్ కోరుకున్న సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని రామ్ ప్రయత్నిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus