ప్లాప్ డైరెక్టర్ తో హిట్ అందుకుంటాడా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో చేయబోతున్నట్టు ముందు నుండీ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఈరోజు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తెలుగు,తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాతో తమిళంలో నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మాస్ సక్సెస్ అందుకోవడంతో రామ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ‘రెడ్’ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా.. భారీ వసూళ్లు రావడానికి కారణం ‘ఇస్మార్ట్ శంకర్’తో వచ్చిన హైప్ అనే చెప్పాలి.

ప్రస్తుతం రామ్ దృష్టి యాక్షన్ సినిమాలపై పడింది. ప్రయోగాలు చేయడానికి రామ్ ఇష్టపడడం లేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకులంతా బిజీగా ఉన్నారు. అందుకే కోలీవుడ్ డైరెక్టర్ తో రామ్ సినిమా చేయాలనుకుంటున్నాడు. నిజానికి దర్శకుడు లింగుస్వామి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు అందుకోలేకపోయాడు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. దీంతో ఏ హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా లేరు.

నిజానికి రామ్ కి కథ వినిపించకముందు గోపీచంద్ కి కథ చెప్పాడు. కానీ గోపీచంద్ ఆసక్తి చూపలేదు. ఆ తరువాత నటుడు హవీష్ కి వినిపించాడు. వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అనుకున్న తరువాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ కథతోనే రామ్ తో సినిమా చేయబోతున్నాడు. అంటే ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన కథకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నమాట. మరి తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న రామ్ కి లింగుస్వామి హిట్ ఇస్తాడో లేదో చూడాలి!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus