Hero Ram: రామ్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా..?

టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని ఈ మధ్యకాలంలో మాస్ కథలపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ వరుసగా మాస్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. దీంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తోన్న సినిమాలో రామ్ నటిస్తున్నారు.

ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని టాక్. ఇదిలా ఉండగా.. ఈరోజు రామ్ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చేతిలో కాఫీ కప్పుతో, కన్నుకొడుతూ ఉన్న ఒక ఫోటోని రామ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో జుట్టు బాగా పెంచుకొని గుబురు గడ్డంతో కనిపించారు రామ్. దీంతో ఈ లుక్ నిమిషాల్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తుండడంతో ట్విట్టర్ లో ఇండియా వైడ్ రామ్ లుక్ ట్రెండింగ్ లో ఉంది.

ఈ కొత్త లుక్ లింగుస్వామి సినిమా కోసమే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మే నెలలో లింగుస్వామి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. పాండమిక్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus