Samantha: మూడేళ్ల క్రితం ఆ సినిమాకు.. ఇప్పుడు ‘యశోద’

స్టార్‌ హీరోలకు థియేటర్ల దగ్గర కటౌట్‌లు పెట్టడం మనకు తెలుసు. సినిమా విడుదల అంటే ఆలస్యం.. నిలువెత్తు కటౌట్లతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఘనత హీరోయిన్లకు చాలా తక్కువగా దక్కుతుంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి కటౌట్‌ల ఆనందం దక్కుతుంది నాయికలకు. ఇప్పుడు సమంతకు ఆ మజా అందించారు ఫ్యాన్స్‌. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా త్వరలో విడుదలవుతోంది. దీంతో హైదరబాద్‌లోని ప్రముఖ థియేటర్‌ సుదర్శన్‌ దగ్గరఆమెకు భారీ కటౌట్‌ కట్టారు.

సరోగసీ బ్యాక్‌డ్రాప్‌లో సమంత టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘యశోద’. హరి – హరీష్‌ దర్శకులుగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రచార వీడియోలు అంచనాల్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో చకొంతమంది అభిమానులు హైదరాబాద్‌లోని ప్రఖ్యాత సుదర్శన్‌ థియేటర్‌ వద్ద సందడి చేస్తున్నారు. సినిమాను ఇక్కడ విడుదల చేస్తున్న నేపథ్యంలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మామూలుగా స్టార్‌ హీరోలకు, కుర్ర స్టార్లకు అభిమానుల నుండి ఇలాంటి గౌరవం అందుతూ ఉంటుంది. అలాంటిది సమంతకు కటౌట్‌ కట్టేసరికి సమంత అంటే వారికి ఎంత అభిమానం అనేది కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు సమంతకు ఇలాంటి కటౌట్‌ ఏర్పాటు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ‘ఓ బేబీ’ సినిమా విడుదల సమయంలో ఇలానే భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు అది దేవి థియేటర్‌ దగ్గర కావడం గమనార్హం. మళ్లీ ఇప్పుడు ఇలా చేశారు. దీంతో ఆ రెండు ఫొటోలను కంపేర్‌ చేస్తూ.. పోస్టులు రాసుకొస్తున్నా నెటిజన్లు.

ఈ పోస్టులు సమంత వరకు వెళ్లడంతో థ్యాంక్యూ చెబుతూ సమంత రీట్వీట్‌ కూడా చేసింది. మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత ‘యశోద’ సినిమా ప్రచారానికి వచ్చే అవకాశం లేదనుకున్నారంతా. అయితే సోమవారం యూట్యూబ్‌ ఛానల్స్‌ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. త్వరలోనే ఆ వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus