Ravi Teja: మేనేజర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చిన రవితేజ… వీడియో వైరల్..!

కొంతమంది హీరోలు తమకు హిట్లు ఇచ్చిన దర్శకులకు ఖరీదైన కార్లు గిఫ్ట్..లుగా ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. హిట్ ఇచ్చారనే కృతజ్ఞతతోనో లేక మంచి కథ ఉంటే మళ్ళీ తమ దగ్గరకే వస్తారనే ఆశతోనో.. దర్శకులకు కొంతమంది హీరోలు కార్లు ప్రజెంట్ చేశారు. కమల్ హాసన్, మహేష్ బాబు, నితిన్ వంటి హీరోలు ఇలాగే దర్శకులకు గిఫ్ట్ లు ఇవ్వడం మనం చూశాం. కొంతమంది నిర్మాతలు కూడా దర్శకులకు ఖరీదైన వాహనాలు, వస్తువులు ఇవ్వడం అనేది మనం చూశాం.

అయితే కొంతమంది స్టార్ హీరోలు తమ మేనేజర్లకు అలాగే ఫిట్ నెస్ ట్రైనర్లకు కూడా కార్లు ఇవ్వడం అరుదు. ప్రభాస్ తన ఫిట్నెస్ ట్రైనర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. అల్లు అర్జున్ అయితే తన సొంత డ్రైవర్ కు.. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కూడా చేశాడు. ఇక తాజాగా రవితేజ కూడా తన మేనేజర్ కు కార్ గిఫ్ట్ గా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

తన వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్న మేనేజర్ కు టాటా కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును బహూకరించాడు. ఈ క్రమంలో ఆ మేనేజర్ తన ఫ్యామిలీతో కలిసి కారు వద్ద తీసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా మొదటి డ్రైవ్ రవితేజ చేయాలనే ఉద్దేశంతో అతని ఇంటికి తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus