Hero Siddharth: సిద్ధార్థ ట్వీట్‌ ఆమె గురించేనా…!

నేరుగా పాయింట్‌కి వచ్చేస్తే… ‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు’ ఇదీ కథానాయకుడు సిద్ధార్థ్‌ చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌. మామూలుగా అయితే సిద్ధార్థ్‌ ఇలాంటి ట్వీట్లు చాలా చేస్తూ ఉంటాడు. ఆ మధ్య రాజకీయం నేపథ్యంలోనూ ఇలాంటి ట్వీట్లు చేశాడు. అప్పుడు ఆ ట్వీట్లకు వచ్చిన రెస్పాన్స్‌ వేరు. ఇప్పుడు ఈ ట్వీట్‌కి వస్తున్న రెస్పాన్స్‌ వేరు. సిద్ధార్థ్‌ నేరుగా చెప్పకపోయినా… ఈ ట్వీట్‌ ఈ రోజు న్యూస్‌ ఆఫ్‌ ది డే గురించే అని అంటున్నారు నెటిజన్లు.

సిద్ధార్థ్‌ ట్వీట్‌ పూర్తిగా చూస్తే మీకు విషయం ఇంకా క్లియర్‌ అర్థం అవ్వొచ్చు. One of the first lessons I learnt from a teacher in school…”Cheaters never prosper.” What’s yours?. ఇదీ దీనికి క్లుప్తంగా చెప్పాలంటే… ‘నేను చదువుకునే రోజుల్లో మా టీచర్‌ నుండి నేర్చుకున్న విషయం… ‘మోసం చేసేవాళ్లు ఎప్పటికీ బాగుపడరు’. మీరేం నేర్చుకున్నారు?’ అని నెటిజన్లను ప్రశ్నించాడు సిద్ధార్థ్‌.

సిద్ధార్థ్‌ ఈ ప్రశ్న ఎవరిని అడిగాడు అనేది పక్కన పెడితే… ఎవరికి ఉద్దేశించి పెట్టాడు అనేది అందరూ ఊహించేస్తున్నారు. ఈపాటికి మీకు కూడా ఈ విషయం అర్థమైపోయుంటుంది. మరోవైపు తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి నాగచైతన్య – సమంత స్వస్తి పలికారు. అయితే ఈ బంధానికి ముందు సమంత, సిద్ధార్థ్‌ కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారని అప్పట్లో చాలా వార్తలొచ్చాయి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus