సినిమాల్లోనే కాదు , బయట కూడా మోస్ట్ రొమాంటిక్ గా కనిపించే హీరోలలో ఒకడు సిద్దార్థ్. ఇతను ఎం మాయ చేస్తాడో ఏమో తెలియదు కానీ,ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ ఇతని వలలో పడిపోయారు. త్రిష , సమంత, హన్సిక ఇలా ఎంతో మందితో ప్రేమాయణం నడిపాడు. సమంత తో అయితే ఇతను ప్రేమాయణం పెళ్లి దాకా వచ్చింది, కానీ ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ ఆయన మన చిన్నప్పుడు సిద్దార్థ్ ని ఎలా చూసామో, అలాగే ఉన్నాడు.
ఇంత యంగ్ గా కనిపించడానికి సీక్రెట్ ఏంటో ఇప్పటి వరకు ఆయన చెప్పలేదు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చిన్నా’ అక్టోబర్ 6 వీకే తేదీన తెలుగు లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఇతర భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా థియేటర్స్ కొరత కారణంగా అక్టోబర్ 6 వ తేదికి వాయిదా పడింది.
ఈ చిత్రం లో (Siddharth) సిద్దార్థ్ హీరో గా నటించడమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఒక విలేఖరి మాట్లాడుతూ ‘మీరు ఈమధ్య ఎక్కువగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా’ అని అడుగుతారు. అప్పుడు దానికి సిద్దార్థ్ సమాధానం ఇస్తూ ‘ వాస్తవానికి నాకు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చెయ్యడం వంటివి అసలు ఇష్టం ఉండదు.
కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ కోసం చెయ్యక తప్పడం లేదు’ అంటూ సిద్దార్థ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదితి రావు హయాద్రి తో ప్రేమలో ఉన్నారా అని ఒక విలేఖరి అడగగా, వాటి గురించి ఇప్పుడు ఎందుకు, ముందు సినిమా గురించి మాట్లాడుకుందాం అంటూ సమాధానం దాటవేసాడు.