తమిళ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాలను సాధించాయి. కోలీవుడ్ ఖలేజా ఉన్నా… సరైన విజయం దక్కని హీరోల్లో శింబు ఒకడు. ఒకప్పుడ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా పేరుగాంచిన శింబు… ఆ తర్వాత నెమ్మదించాడు. దానికి కారణాలు చాలా ఉన్నా… స్ట్రాంగ్ కమ్ బ్యాక్ మాత్రం చాలా అవసరం అనిపించే స్థితిలోకి వచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. శింబు తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. నిన్నటి నుంచి అధిక జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చేరాడు. కాగా, శింబుకు కరోనా కాదని, ఇతర ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు చెప్పారని సన్నిహితులు వెల్లడించారు. శింబు ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
శింబు హీరోగా నిర్మాత మైఖేల్ రాయప్పన్ ‘అన్బానవన్ – అరసాదవన్ – అడంగాదవన్’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న శింబు.. తన అభీష్టం మేరకు నిర్మించారు. అలా రిలీజైన సినిమా కాస్తా.. ప్లాప్ అయింది. దీంతో నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం కలిగింది. ఈ క్రమంలో నిర్మాత, హీరో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. ఓ సినిమాను ఫ్రీగా చేస్తానని ఒప్పుకున్నాడు శింబు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ తరువాత శింబు మాట తప్పారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాతల మండలి.. ఇరువర్గాలను పిలిచి సంప్రదింపులు జరిపారు.