Srikanth: శ్రీకాంత్ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డులు సాధించిందో తెలిస్తే షాక్ అవుతారు!

కొన్ని కొన్ని సార్లు చిన్న హీరోల సినిమాలు అద్భుతమైన కోనేట్న్ట్ తో మన ముందుకి వచ్చినప్పుడు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ స్టార్ హీరోల రికార్డ్స్ ని మించి ఉంటాయి. ఇలా జరగడం అనేది మొదటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మనం గమనిస్తూనే వచ్చాము. అలా అప్పట్లో శ్రీకాంత్ హీరో గా నటించిన ఒక సినిమా సీనియర్ ఎన్టీఆర్ మరియు మెగాస్టార్ చిరంజీవి రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది.రికార్డు స్థాయి వసూళ్లతో పాటుగా, సంవత్సరం పాటు థియేటర్స్ లో రన్ అయ్యింది ఆ చిత్రం.

ఆ చిత్రం పేరు పెళ్లి సందడి. అప్పటి వరకు సాదాసీదా హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగుతూ వచ్చిన హీరో శ్రీకాంత్, ఈ చిత్రం తో యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక అసలు విషయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా పని చేస్తున్న సమయం లోనే ప్రముఖ హీరో మోహన్ బాబు ప్రత్యేక అభ్యర్థనని మన్నించి ఆయన బ్యానర్ లో ‘మేజర్ చంద్రకాంత్’ అనే చిత్రం చేసాడు. 1993 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.

ఆ రోజుల్లోనే ఈ సినిమా (Srikanth) సుమారుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని అంచనా. అయితే 1996 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన శ్రీకాంత్ ‘పెళ్లి సందడి’ చిత్రం ఏకంగా మేజర్ చంద్ర కాంత్ చిత్రం కలెక్షన్స్ ని దాటేసి, అప్పటి ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతున్న ‘పెద్ద రాయుడు’ కలెక్షన్స్ ని కూడా అధిగమించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిందట.

కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, 50 రోజులు మరియు వంద రోజుల సెంటర్స్ విషయం లో కూడా ఈ చిత్రం రికార్డు ని నెలకొల్పిందట. అంతే కాదు ఈ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాలైనా గ్యాంగ్ లీడర్ మరియు ఘరానా మొగుడు కలెక్షన్స్ ని కూడా దాటి సంచలనం సృష్టించిందట. అలా శ్రీకాంత్ సినిమా చిరంజీవి మరియు సీనియర్ ఎన్టీఆర్ లాంటి దిగ్గజ సూపర్ స్టార్ సినిమాలను సైతం అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus