Sriram: సినిమా ఫ్లాప్ అని తెలిసిన నటించక తప్పలేదు!

ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీరామ్ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈయన పిండం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో హీరో శ్రీరామ్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను హీరోగా నటించినటువంటి సినిమాలలో షావ్‌కార్‌ పెట్టై చిత్రం నిరాశపరిచింది. ఈ సినిమా గురించి శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా ప్లాప్ అనే సంగతి నాకు తెలుసు. ఈ సినిమా పోతుందనే విషయం తెలిసినప్పటికీ ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది. కొన్నిసార్లు సినిమా పోతుందని తెలిసినా కూడా నటించక తప్పదు అంటూ శ్రీరామ్ తెలిపారు.

ఈ సినిమా కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఒకలా చెప్పి సినిమా షూటింగ్ సమయంలోనే మరో కథను తెరపైకి తీసుకువచ్చారని ఆ సమయంలోనే ఈ సినిమాలో నేను చేయను అని నిర్మాతల దగ్గర చెప్పేశాను. ఈ సినిమా ఇప్పుడు మీరు చేయకపోతే తాము రోడ్డుపై పడతామని నిర్మాతలు నన్ను వేడుకోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా చేయాల్సి వచ్చిందని అయితే ఇలాంటి అనుభవం ప్రతి ఒక్క హీరోకి కూడా జరుగుతుందని కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతారు అంటూ శ్రీరామ్ తెలిపారు.

ఇక పిండం సినిమా గురించి మాట్లాడుతూ ఇది పూర్తి హర్రర్ జానెర్ సినిమా అంటూ ఈయన తెలియచేశారు. పిండం అనే టైటిల్ పెట్టడంతో చాలామంది నెగటివ్ టైటిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ పిండం అంటే నెగిటివ్ మాత్రమే కాదని పాజిటివ్ అని తెలిపారు. ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు దానిని పిండం అనే అంటారు అలాగే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ శాంతించడానికి పిండం పెడతారు కనుక ఇది పాజిటివ్ టైటిల్ అనే సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ శ్రీరామ్ (Sriram) తెలిపారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus