Sumanth, Jr NTR: ఎన్టీఆర్ పై హీరో సుమంత్ కామెంట్స్ వైరల్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఒకరు. కానీ నటన పరంగా చూసుకుంటే ఇతని తర్వాతే ఎవ్వరైనా అని చెప్పాలి. కచ్చితంగా ఎన్టీఆర్ ఒక ఆల్ రౌండర్. డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగులు ఇలా ఏది తీసుకున్నా అతను ఇరక్కొట్టేస్తుంటాడు. తారక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అతనితో పనిచేసిన దర్శకులంతా చెబుతుంటారు. అతని ట్యాలెంట్ గురించి చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రాల్లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ వేడుకలు చూస్తే చాలు.

Click Here To Watch

అతను తమిళ్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లకి వెళ్తే తమిళ్ లో, కన్నడలో ప్రమోషన్ కు వెళ్తే కన్నడ లో , మలయాళంలో ప్రమోషన్ చేస్తే మలయాళం లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంత ఈజ్ తో పరాయి భాషలో మాట్లాడాలి అంటే సాధరమైన విషయం కాదు.అది ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఇండస్ట్రీలో తోటి హీరోలు కూడా కథలు కథలుగా చెబుతుంటారు. ఇప్పుడు హీరో సుమంత్ వంతు వచ్చింది.

తన మళ్ళీ మొదలైంది సినిమా ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయ్యింది. దీని ప్రమోషన్ లలో భాగంగా సుమంత్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో సుమంత్ కు ఎన్టీఆర్ కు సంబంధిచిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సుమంత్ బదులిస్తూ..”తారక్… నా దృష్టిలో అతను ప్యూర్ యాక్టర్ అలాగే బెస్ట్ యాక్టర్. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలడు.ఆ ఇంటెన్సిటీ అతనిలో ఉంది. యంగ్ ఏజ్లోనే అతను స్టార్ అయ్యాడు అంటే..

.

అతని బ్లడ్ లోనే ఆ యాక్టింగ్ అనేది ఉంది. అతని తాతగారి పోలికలు అణువణువు ఉన్నాయి అతనిలో..! తారక్ లో ఇమ్మెన్స్ పవర్, ఇమ్మెన్స్ ఎనర్జీ ఉంటుంది. ‘యమదొంగ’ లో అతను చెప్పిన డైలోగ్స్ మరే హీరో చెప్పలేడు అనే విధంగా ఉంటాయి ” అంటూ ప్రశంసించాడు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus