టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్యకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్న సూర్య విక్రమ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించి మెప్పించారు. ఆకాశమే నీహద్దురా, జై భీమ్ సినిమాలు కూడా సూర్యకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలపై దృష్టి పెట్టిన్ హీరో సూర్య సినిమాల ద్వారా బాగానే ఆస్తులు సంపాదించారు. తను సంపాదించే మొత్తంలో కొంత మొత్తాన్ని సూర్య సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సూర్య ఏకంగా 186 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు. ఒక్కో సినిమాకు సూర్య రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని ఏదైనా బ్రాండ్ కు ప్రచారం చేయాలంటే మాత్రం 2 కోట్ల రూపాయల రేంజ్ లో సూర్య రెమ్యునరేషన్ తీసుకుంటారని బోగట్టా. సౌత్ ఇండియాలో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు కార్లు అంటే ఎంతో ఇష్టం కాగా సూర్య గ్యారేజ్ లో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయని తెలుస్తోంది.
కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన సూర్య 1997 సంవత్సరంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. సూర్య 2006 సంవత్సరంలో జ్యోతికను పెళ్లి చేసుకున్నారు. సూర్య, జ్యోతిక కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. సూర్య, జ్యోతిక దంపతులకు దియా, దేవ్ పేర్లతో కొడుకు, కూతురు ఉన్నారు.
సూర్య కొడుకు, కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. సూర్య సోదరుడు కార్తి కూడా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు భిన్నమైన కథలతో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!