కోలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శివకుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు సూర్య. ఈయన ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న సూర్యకు కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈయన తమిళంలో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవ్వడమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నాయి.
ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సూర్య ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే విషయానికి వస్తే… ఈయన చదువుకుంటున్న సమయంలో వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది కాదు ఎంతో కష్టపడుతూ సూర్య డిగ్రీ పూర్తి చేశారు. సూర్య డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన తమ్ముడు కార్తీ ఇంటర్ చదవగా చెల్లెలు పదవ తరగతి చదువుతున్నారు. అదే సమయంలో తన తండ్రికి కూడా అవకాశాలు అంతంత మాత్రమే కావడంతో వీరి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.
అయితే డిగ్రీ పూర్తి చేసిన సూర్య కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈయన డిగ్రీ పూర్తి కాగానే రెండు నెలల పాటు కష్టపడుతూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు. అయితే ఈయన రెండు నెలల తర్వాత ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ ఉండేవారు.ఇలా బట్టల దుకాణంలో పనిచేయడం వల్ల సూర్యకు తొలి జీతం 1200 రూపాయలు సంపాదించారు. ఇదే ఈయన మొదటి రెమ్యూనరేషన్ అని చెప్పాలి.
ఇలా తన మొదటి సంపాదనతో సూర్య తన తల్లికి అలాగే చెల్లికి చీరలు కొనిచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేస్తున్న సూర్య అనంతరం ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి నేడు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?