తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈయన నటనకి మాత్రం మంచి మార్కులే పడుతుంటాయి. ఇది పక్కన పెడితే.. తాజాగా సూర్య స్టేజి పై కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే… సూర్య… ‘అగరం’ అనే ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాడు.ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పేస్తున్నాడు.
పదేళ్లుగా ఈ ఫౌండేషన్‌ను విజయవంతంగా నడుస్తోంది. ఇక తాజాగా ‘అగరం’ ఫౌండేషన్ తరఫున రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యాడు. ఈ క్రమంలో గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. అలాగే తన చదువు పూర్తి చేసిన విధానాన్ని వివరించింది. ‘తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరుకు చెందిన గాయిత్రి… తన పదో తరగతి వరకూ ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందట. అమ్మ రోజూ కూలీగా పనిచేసేదట. నాన్న క్యాన్సర్‌తో బాధపడుతుండేవాడని తెలిపింది. ఇదిలా ఉండగా.. పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితులను చూసి ‘నేను కూడా కూలి పనికి పోతాను’ అని తన తల్లికి చెప్పిందట. అయితే ‘మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకునయినా నిన్ను చదివిస్తాను’ అని చెప్పిందట. ఆ తర్వాత అగరం ఫౌండేషన్‌లో చేరిందట. అయితే తరువాత కొన్ని రోజులకే ఆమె తండ్రి చనిపోయాడట. ఆ సమయంలో చదువు మానేద్దామని అనుకున్నట్టు గాయత్రి అనుకుందట. మళ్ళీ ‘నీ కోసం నువ్వు చదవాలని’ అమ్మ ధైర్యం చెప్పడంతో ముందడుగు వేసిందట. మధ్యలో ఎంతో మంది అక్కడ ఎగతాళి చేశారని.. కానీ అగరం సాయంతో విద్యను పూర్తిచేసి… ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ సంపాదించుకున్నట్టు తెలిపింది. తన జీవితంలో వెలుగు నింపినందుకు అగరానికి, మరియు సూర్యకు కృతజ్ఞతలు తెలిపింది. అందుకోసమే ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చింది. గాయత్రి చెప్పినదంతా విన్న.. సూర్య ఎమోషనల్ అయ్యాడు. స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్నాడు.
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!