Suriya: అభిమాని మరణించడంతో ఇంటికి వెళ్లి నివాళులు అర్పించిన సూర్య!

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలగా కొనసాగుతున్న వారిలో సూర్య ఒకరు.ఈయనకు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.సూర్య ఎంతో గొప్ప హీరో అయినప్పటికీ ఈయన తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెడుతూ ఎంతోమంది చిన్నారులకు సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఇలా అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య ఎంతో మంది అనాధ చిన్నారులను చేరదీస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా అభిమానులకు కూడా సూర్య ఎల్లప్పుడు ఎంతో దగ్గరగా ఉంటారు. అభిమానుల పెళ్లికి వెళ్లడం, వారికి ఏదైనా ఆపద వస్తే స్పందించడంలో ఈయన ముందుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సూర్య అభిమాని జగదీశన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న సూర్య తన అభిమాని మృతి చెందడంతో ఎంతో చలించిపోయాడు. ఈ క్రమంలోనే సూర్య స్వయంగా తన అభిమాని ఇంటికి వెళ్లి తనకు తుది వీడ్కోలు పలికారు.ఇలా అభిమాని కోసం స్వయంగా సూర్య వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు సూర్యని చూడగానే ఒక్కసారిగా బోరున విలపించారు.ఇక కుటుంబ సభ్యులను ఓదారుస్తారు తమ బిడ్డను తాను తీసుకురాలేనని అయితే ఆ కుటుంబ బాధ్యతను మాత్రం తాను తీసుకుంటానని తెలిపారు.

ఈ క్రమంలోనే తన అభిమాని పిల్లలకు చదువు, వైద్యం ఖర్చులన్నీ సూర్య ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు ఈ సందర్భంగా సూర్య తన అభిమాని కుటుంబానికి భరోసా కల్పించారు.ఇలా అభిమానుల పట్ల ఎంతో గొప్ప మనసు చాటుకున్న సూర్య రీల్ హీరో కాకుండా రియల్ హీరో అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇక సూర్య సినిమాల విషయానికొస్తే ఈయన బాలా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus