Suriya: కూతురి టాలెంట్ చూసి మురిసిపోతున్న సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈయనకు తమిళనాడు మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి. సూర్య నటించిన సినిమాలకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ లభించడమే కాకుండా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. తాజాగా ఆయన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు. సూర్య సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఆగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధలకు ఉచిత విద్య వైద్యం అందిస్తూ మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు పొందారు.

ఇక సినిమా షూటింగులు లేకపోతే సూర్య ఎక్కువగా తన పిల్లలతో సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా తన కూతురు దియా అంటే సూర్యకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం దియా పదవ తరగతిని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులో ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేయడంతో తన పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే సూర్య కూతురు సాధించిన మార్కులను చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

500 కు గాను ఈమె 487 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. దియా ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ 95 పైగా మార్కులు సంపాదించి మంచి ఉత్తీర్ణత సాధించారు. ఇలా ఈమె మంచి ఉత్తీర్ణత సాధించడంతో దాని వెనుక ఎంత కష్టం ఉందో అర్థమవుతోంది. ఇకపోతే సూర్య కూతురు పదవ తరగతిలో సాధించిన ఉత్తీర్ణత పట్ల ఆమెలో ఉన్న టాలెంట్ చూసి సూర్య ఎంతో మురిసిపోతున్నారు.

ప్రస్తుతం దియా పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మార్కులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది సూర్య అభిమానులు సూర్య కూతురా మజాకా అంటూ కామెంట్లు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున సూర్య కూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా దియా ఎంతో టాలెంటెడ్ అంటూ మరికొందరు తనపై అభినందనలు కురిపిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus