అక్కినేని నాగేశ్వరరావు మూడవతరం సినీ వారసులలో సుశాంత్ ఒకరు. 2008లో వచ్చిన దేవదాస్ సినిమాతో ఈ హీరో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి చిత్రం అట్టర్ ప్లాప్ అయినా రెండో మూవీ కరెంట్ తో హిట్ అందుకున్నాడు. ఐతే ఆ తరువాత ఈ హీరో చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక 2018లో విడుదలైన చిలసౌ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంశలు అందుకుంది.
నటుడు రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిలసౌ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దీనితో ఈ హీరోకి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీనితో చేసేదేమీ లేక అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో మూవీలో ఓ రోల్ చేశారు. సినిమా విడుదల తరువాత అసలు ఈ పాత్ర చేయడం వలన సుశాంత్ కి ఒరిగేదేముంది అని అందరూ అనుకున్నారు. దానికి కారణంగ సరైన డైలాగ్ కానీ, ఎమోషన్స్ కానీ లేని ఓ డంబ్ రోల్ అది.
ఐతే ఆ సినిమా వలన తనకు జరిగిన ప్రయోజనం ఏమిటో హీరో సుశాంత్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అల వైకుంఠపురంలో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరికీ రీచ్ అయ్యిందట. దాని వలన సుశాంత్ కి తన ఫస్ట్ కమర్షియల్ యాడ్ స్ప్రైట్ రూపంలో దక్కిందట. ఈ సినిమా వలన స్ప్రైట్ యాడ్ తనకు దక్కింది అని అన్నాడు. అలాగే త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో ఒకసారైనా చేయాలనే కోరికతోనే ఈ మూవీ ఒప్పుకున్నాడట.
Most Recommended Video
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!