Hero Tarun: అలా జరిగితే మాత్రమే తరుణ్ రీఎంట్రీ ఇస్తారా?

  • December 6, 2022 / 01:29 AM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన తరుణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తరుణ్ సినిమాలు భారీ సక్సెస్ సాధించకపోయినా లవర్ బాయ్ ఇమేజ్ తో తరుణ్ కెరీర్ ను కొనసాగించారు. అయితే ప్రస్తుతం పలు వ్యాపారాలతో బిజీగా ఉన్న తరుణ్ సరైన కథ దొరికితే రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమేనని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తరుణ్ రీఎంట్రీ కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో తరుణ్ నటిస్తారని జోరుగా ప్రచారం జరిగినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తరుణ్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తారా? లేక సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెబుతారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. తరుణ్ లుక్ అప్పటికీ ఇప్పటికీ మారలేదనే సంగతి తెలిసిందే. తరుణ్ ను మెప్పించే కథను ఏ డైరెక్టర్ సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.

లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తరుణ్ ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రీఎంట్రీలో తరుణ్ సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం తరుణ్ పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. బిజినెస్ లలో ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన తరుణ్ సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం అయితే లేదని మరి కొందరు చెబుతున్నారు.

అయితే తరుణ్ మనసులో ఏముందనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. తరుణ్ ను వెండితెరపై మళ్లీ చూడాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. తరుణ్ కు యూత్ లో ఇప్పటికీ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరుణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus