Hero Tarun: బిగ్ బాస్ షోపై నువ్వే కావాలి హీరో దృష్టి పెట్టారా?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షోకు సంవత్సరంసంవత్సరానికి రేటింగ్స్ తగ్గుతున్నాయి. ఈ షొలో ఇచ్చే టాస్క్ లు రొటీన్ గా ఉండటంతో చాలామంది ప్రేక్షకులు ఈ షోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే త్వరలో బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్6 ప్రసారం కానుండగా ఈ సీజన్ లో సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్నారని సమాచారం అందుతోంది. అయితే లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న తరుణ్ కు తర్వాత సినిమాల ఫలితాలు షాకిచ్చాయి. నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తరుణ్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న సినీ ప్రముఖులకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో పాటు సినిమా ఆఫర్లు సైతం పెరుగుతున్నాయి. అందువల్ల తరుణ్ ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తరుణ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీ గురించి వార్తలు ప్రచారంలోకి రావడం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ రావడం జరిగింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల గురించి తరుణ్ స్పందించాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 6కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉండటం సీనియర్ స్టార్ హీరోలు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ షోకు నాగార్జునే హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో నాగ్ హిట్ సాధించగా బ్రహ్మాస్త్రం, ది ఘోస్ట్ సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. నాగ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus