అది నిజమైతే.. తెలుగు ప్రేక్షకులకి కూడా పండగే!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ‘తుపాకీ’ ‘జిల్లా’ ‘పోలీస్’ ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. ప్రస్తుతం విజయ్ కు తెలుగులో 10కోట్ల మార్కెట్ ఉంది. ఆయన తర్వాతి చిత్రం ‘మాస్టర్’ కూడా అదే రేటుకి కొనుగోలు చేస్తున్నరు. మీరు ఇది గమనిస్తే… విజయ్ కు ఉన్న మార్కెట్ కంటే ఎక్కువగా .. అంటే 10 కోట్ల పైనే ఆ చిత్రం కలెక్ట్ చెయ్యాలి. ఆ చిత్రాన్ని ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి అంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేస్తున్నారు. ‘ఖైదీ’ చిత్రం ఇక్క కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. విజయ్ తరువాతి చిత్రాన్ని మురుగదాస్ డైరెక్షన్లో ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ ‘కత్తి’ ‘సర్కార్’ చిత్రాలు సూపర్ హిట్లయ్యాయి. దాంతో ఈసారి వచ్చే చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని వారు ఆశిస్తున్నారు. అందులోనూ వీరి కాంబినేషన్లో ‘తుపాకీ’ వంటి చిత్రం వస్తే బాగుణ్ణు అని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ‘కత్తి’ ‘సర్కార్’ చిత్రాలు పూర్తిగా మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు. అయితే ‘తుపాకీ’ ఎంతో ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లేతో కూడుకుని ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ -మురుగదాస్ కాంబినేషన్లో వచ్చే తదుపరి చిత్రాలు కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. దీనికి ‘తుపాకీ2’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. అదే కనుక నిజమైతే తెలుగుప్రేక్షకులకి కూడా ఇది పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలి..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus