ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సీఐడీ వారు దర్యాప్తులో చంద్రబాబుని నిందితుడిగా తీర్మానించి అరెస్ట్ చేయడం జరిగింది. గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో టీడీపీ అధినేతలు అలాగే చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల నుండి చంద్రబాబుకి మద్దతు లభిస్తుంది. అయితే సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం చంద్రబాబు అరెస్ట్ విషయంలో కనీసం స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ.. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెంటే ఉన్నారు. ఇక కె.రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం జరిగింది. సీనియర్ హీరో వేణు కూడా ఇది కక్ష్య సాధింపు చర్య అని అభిప్రాయపడ్డారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. ‘చంద్రబాబు వంటి బడా నిర్మాతని అరెస్ట్ చేసే విషయంలో కొంచెం ఆలోచించి వ్యవహరించి ఉంటే బాగుండేది. పూర్తి ఆధారాలు సేకరించి.. వాటిని అందరికీ అర్థమయ్యేలా చెప్పి అరెస్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల.. సామాన్యులు కూడా ఆందోళన చెందే పరిస్థితి వాటిల్లింది’ అంటూ విశాల్ (Vishal) చెప్పుకొచ్చారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!