Vishal: డబ్బులు ఇచ్చి ఈ మొహాన్ని ఎవరైనా చూస్తారా అన్నారు!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విశాల్ తాజగా మార్క్ ఆంటోనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటించిన ఈ సినిమా నేడు విడుదల అయిన సందర్భంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా విశాల్ నటుడు విజయ్ తలపతి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తనకు విజయ్ తళపతి చాలా రోజుల నుంచి తెలుసని ఆయనతో తనకు మంచి పరిచయం ఉందని తెలిపారు. ఇక నటుడు విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అంటూ తెలియచేశారు. అయితే విజయ్ తో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలన్నదే నా కల అంటూ ఈయన తెలియచేశారు. త్వరలోనే నా కల నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అంటూ విశాల్ (Vishal) ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక ఇద్దరం కలిసి సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఒకరోజు విజయ్ మేనేజర్ కు ఫోన్ చేసి నేను విజయ్ అపాయింట్మెంట్ కావాలని కోరడంతో తాను ఆశ్చర్యపోయారని విశాల్ తెలియజేశారు. కాలేజీ చదివే రోజుల నుంచి పరిచయం ఉందని తెలిపారు. ఇక విజయ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఈయన గురించి ఒక మ్యాగజైన్లో ఎంతో అవమానకరంగా వార్తలు రాశారు. డబ్బులు ఇచ్చి మరి ఈ మొహాన్ని చూడటానికి థియేటర్ కి వెళ్ళాలి అంటూ మాట్లాడరు. అయితే ఈయన సక్సెస్ అయిన తర్వాత అదే మ్యాగజైన్ లో విజయ్ బ్లాక్ బస్టర్ సినిమా కథనాలు వచ్చాయని అది తలపతి పవర్ అంటూ ఈ సందర్భంగా విజయ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus