Vishal: అవార్డులపై నాకు నమ్మకం లేదు.. హీరో విశాల్ కామెంట్ వైరల్!

తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయనకు తమిళంలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అదే ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా నటుడిగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే మార్క్ ఆంటోనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హీరో విశాల్ జాతీయ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తమ జాతీయ నటుడుగా తెలుగులో అల్లు అర్జున్ అవార్డును అందుకోవడం విశేషం

అయితే ఈ అవార్డుల గురించి (Vishal) విశాల్ ను ప్రశ్నించగా ఆయన అవార్డుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నాకు అవార్డుల పై ఏ విధమైనటువంటి నమ్మకం లేదు నాకు ప్రజలు అభిమానులు నాపట్ల చూపించే అభిమానమే నాకు నిజమైనటువంటి అవార్డులనీ ఈయన తెలిపారు. వారి ఆశీర్వాదంతో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని తెలిపారు.

ఒకవేళ నా సినిమాలకు ఇలాంటి అవార్డులు వచ్చిన నేను ఆ విషయాలను పెద్దగా పట్టించుకోనని ఆ అవార్డులను చెత్తబుట్టలో వేస్తాను అంటూ ఈ సందర్భంగా జాతీయ అవార్డుల గురించి అలాగే ఇతర అవార్డుల గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus