ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మొదట దర్శకత్వ విభాగంలో పని చేశారు. డైరెక్టర్ అవ్వాలనుకొని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరోలుగా మారారు. రవితేజ, నాని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి నటులు ఈ కోవకి చెందినవారే. హీరో విశాల్ కూడా వీరిలానే డైరెక్టర్ అవుదామనుకొని.. హీరో అయ్యాడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విశాల్.. డైరెక్టర్ గా మారి సినిమాలు తీయాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా హీరో అయిపోయాడు. కానీ ఏదొక రోజు డైరెక్టర్ గా సినిమా చేస్తానని విశాల్ చెబుతూనే ఉన్నాడు.
గతేడాది అనుకోకుండా మెగాఫోన్ పట్టేశాడు ఈ హీరో. తన హిట్ సినిమా ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ సీక్వెల్ నుండి దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో విశాల్ మిగతా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత మరో సినిమాతో పూర్తి స్థాయి దర్శకుడిగా మారనున్నట్లు విశాల్ వెల్లడించాడు. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఇరుంబు తిరై'(తెలుగులో అభిమన్యుడు) సినిమాకి సీక్వెల్ రానుందని.. ఆ సినిమాను తనే డైరెక్ట్ చేశానని విశాల్ వెల్లడించాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం తన స్నేహితుడు ఆర్యతో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమాలో నటిస్తున్నట్లు చెప్పాడు. అలానే శరవణన్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ తో ఓ సినిమా మొదలుపెట్టనున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘చక్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Most Recommended Video
కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!