Salaar: సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ ఎప్పుడంటే?

స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు సలార్ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెల 6వ తేదీన సలార్ ట్రైలర్ విడుదల కానుంది. సలార్ ట్రైలర్ లో యశ్ కూడా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ ఆరోజేనని సమాచారం అందుతోంది.

షారుఖ్ సినిమా రిలీజ్ కు ఒకరోజు ముందే సలార్ ట్రైలర్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ నెలలో ఓజీ గ్లింప్స్, సలార్ ట్రైలర్ సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ రికార్డుల విషయంలో ట్రెండ్ సెట్ చేయనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ ట్రైలర్ ఆకాశమే హద్దుగా అంచనాలను పెంచనుందని తెలుస్తోంది. ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా నిరాశకు లోనయ్యే అవకాశం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ రిలీజ్ కు ముందు సైలెంట్ గా ఉన్నా ఈ సినిమాతో సృష్టించే వయోలెన్స్ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సలార్2 పై అంచనాలను రెట్టింపు చేసేలా సలార్ ఉండనుందని సమాచారం. సలార్3 కూడా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.

సలార్ (Salaar) ప్రభాస్ కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా మూడేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. సలార్ లో శృతి రోల్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. సలార్ బాహుబలి2 సినిమాను మించి కలెక్షన్లను సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus