Hero Yash: యశ్‌ కొత్త సినిమా తేలిపోయింది… 18 నెలల తర్వాత స్టార్ట్‌!

అప్పటికి చాలా సినిమాలే చేసిన యశ్‌ ‘కేజీయఫ్‌’ సినిమాలతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. అందుకేనేమో ఆ తర్వాతి సినిమాను అంటే తన 19వ సినిమాను అనౌన్స్‌ చేయడానికి చాలా రోజుల సమయం తీసుకున్నారు. ఇప్పటికి, ఇన్నాళ్లకు అంటే 18 నెలల తర్వాత కొత్త సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చింది అని చెబుతున్నారు. అవును యశ్‌ కొత్త సినిమా స్టార్ట్‌ అవ్వబోతోంది. ముందుగా వచ్చిన రూమర్స్‌ నిజం చేస్తే మహిళా దర్శకురాలితోనే యశ్‌ ఈ సినిమా చేయబోతున్నారట.

యశ్‌ 19వ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో చేయనున్నట్లు దాదాపు ఖరారైంది. కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు తుది దశకు వచ్చాయి. డిసెంబరు నుండి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతారు అని అంటున్నారు. ఇంతకీ గీతూ మోహన్‌ ఎవరో చెప్పలేదుగా ‘లయర్స్‌ డైస్‌’, ‘మూతన్‌’ తదితర సినిమాలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. విజయాన్ని, ప్రశంసలను కూడా అందుకున్నారు. ఇప్పుడు యశ్‌ను డైరక్ట్‌ చేయబోతున్నారు.

నిజానికి ‘కేజీయఫ్‌ 2’ వచ్చి ఇన్నాళ్లు అయినా ఇంకా యశ్‌ తన కొత్త సినిమాను అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇంకెంత కాలం వెయిట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికిగాను యశ్‌ ఓపెన్‌గా తన ఆలోచనల్ని చెప్పాడు. కాస్త వెయిట్‌ చేయండి అని కూడా కోరాడు. ఇప్పుడు ఆ తీపికబురు మరికొద్ది రోజుల్లో అని చెబుతున్నారు.

ఈ మేరకు (Hero Yash) యశ్‌కు త్వరలో లుక్ టెస్ట్‌లు కూడా చేస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం యశ్‌ ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నాడు. తిరిగి రాగానే ఈ టెస్ట్‌ ఉండబతోంది అంటున్నారు. ఇక ఈ సినిమాను భారీ లెవల్‌లో విడుదల చేస్తారు. అంటే పాన్‌ ఇండియా రిలీజ్‌ ఉండబోతోంది. మామూలుగానే గీతూ మోహన్‌ దాస్‌ ప్రయోగాలు చేస్తుంటారు. యశ్‌కు మరి ఎలాంటి కథ సిద్ధం చేశారు అనేది చూడాలి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus