రెండు రోజుల క్రితం విడుదలైన ‘అఖండ’ చిత్రం టాలీవుడ్ కు కొత్త హోప్ ను ఇచ్చిందనే చెప్పాలి. మొన్నటి వరకు పెద్ద సినిమా భవిష్యత్తు ఏమైపోతుందో అంటూ భయపడిన పెద్ద సినిమాల మేకర్స్ హ్యాపీగా టికెట్ రేట్లతో సంబంధం లేకుండా తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి ముందడుగు వేస్తున్నారు.ఇక అఖండ ఇంత ఘన విజయం సాధించడనికి ముఖ్య కారణం… నేపథ్య సంగీతం మరియు ఫైట్స్ వల్లే అనుకోవాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దర్శకుడు బోయపాటి శ్రీను
కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఫైట్స్ కే పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పాలి. దాంతో బాలయ్య బోయపాటి కంటే కూడా నేపథ్య సంగీతానికి గాను తమన్ ను అలాగే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లను తెర వెనుక హీరోలుగా పరిగణించాలి. సీన్ సేన్ కు ఓ ఎలివేషన్… ఆ తర్వాత ఫైట్ ఉంటుంది. అఘోరగా బాలయ్య ఎంట్రీ సీన్ దగ్గర నుండీ క్లైమాక్స్ వరకు బోలెడన్ని ఎలివేషన్ లు ఫైట్ లు ఉంటాయి.
వాటిని చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు గూజ్ బంప్స్ రావడం ఖాయం అనడంలో అతిశయోక్తి ఉండదు. ఈ విషయంలో అటు తమన్ కు కానీ ఇటు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు వందకి వంద మార్కులు పడతాయి. మాస్ సినిమాలకి ఈ తెర వెనుక హీరోలు చాలా అవసరం అని అఖండ చెప్పకనే చెప్పింది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!