Heroes: ఫ్యాన్స్‌ వేడుకుంటున్న స్టార్‌ హీరోలు… విలన్‌కి కూడా ఈ కష్టం రాకూడదు!

ఒకప్పుడు సినిమా హీరోలు ‘పైరసీ భూతం తరిమిడి కొడదాం. థియేటర్లలోనే సినిమా చూద్దాం’ అంటూ పిలుపునిచ్చేవారు గుర్తుందా. సినిమా విడుదలవుతోంది అంటే ఈ మాటే చెప్పేవారు. ఆ మాట జనాలు విన్నారా? లేదా? అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా జనాలు ఆ విషయం వదిలేసి మరో విషయంలో ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు రిక్వెస్ట్‌ చేస్తున్నారు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతింటే… ఇప్పుడు జనాలు చేస్తున్న పని వల్ల టికెట్లు తెగడం లేదు అనేది వాదన.

మొన్నటికి మొన్న ‘జపాన్‌’ సినిమా విడుదల సందర్భంగా కార్తి తన అభిమానులకు, ప్రేక్షకులకు ఓ కోరిక కోరాడు. ఆ విషయం ఏంటో మీరూ చూసే ఉంటారు. ‘‘సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను దయచేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దు’’ అని కార్తి కోరాడు. సినిమా విడుదల సందర్భంగా స్పాయిలర్స్‌ గురించి ఆయన చేసిన ప్రకటన చూసి ఇదేదో కొత్తగా ఉందే అనుకున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇదే పని చేశాడు.

సల్మాన్‌ నటించి ‘టైగర్‌ 3’ సినిమా నవంబరు 12న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా చూసినప్పుడు కలిగే అనుభూతిని స్పాయిలర్స్‌ నాశనం చేయొచ్చు. మేం ఎంతో నిబద్ధత, అభిరుచితో ‘టైగర్‌ 3’ సినిమాను తెరకెక్కించాం. సినిమాలోని ఆసక్తికర విషయాలను దయచేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకండి. మీరు ఇలాంటి పనులు చేయరని నమ్ముతున్నాం అంటూ నెటిజన్లను ఉద్దేశించి (Heroes) సల్మాన్‌ మాట్లాడాడు. ఆ సినిమాలో విలన్‌గా నటించిన ఇమ్రాన్‌ హష్మీ కూడా ఇదే మాట అన్నాడు.

దీంతో నెటిజన్ల వల్ల సినిమాలకు కలుగుతున్న నష్టాన్ని ఇప్పుడిప్పుడు పెద్ద హీరోలు పట్టించుకుంటున్నారు అని అనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే రాబోయే పెద్ద సినిమాల హీరోలు అందరూ ఇలాంటి పిలుపు ఇచ్చేలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే స్పాయిలర్స్‌ను నెటిజన్లు ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో బయట ఉంటూనే అసలు ట్విస్ట్‌లు తెలిసేసుకుంటున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus