దర్శకులు తప్పుకుంటే.. హీరోలే డైరెక్టర్లు అయ్యారు..!

క్రియేటివ్‌ డిఫరెన్సెస్… ఈ మధ్య కాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఓ సినిమా రూపొందిస్తున్న టైం లో ఒక్కొక్కరికి ఒక్కో ఐడియా ఉంటుంది. డైరెక్టర్ కు నచ్చింది.. హీరోకి నచ్చకపోవచ్చు, హీరోకి నచ్చింది దర్శకుడికి నచ్చక పోవచ్చు.. వీరిద్దరికీ నచ్చింది నిర్మాతకి నచ్చకపోవచ్చు.. చెప్పలేం. అలా అని ఈ నచ్చని ఐడియాలు అన్నీ కరెక్ట్ చేస్తే సినిమా హిట్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ సినిమా హిట్ అయితే ఈ నచ్చని ఐడియాలు అన్నీ కరెక్ట్ అయిపోవచ్చు.

అయితే సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు తెలిసి తెలిసి నచ్చనిది చేయడానికి దర్శకుడు కానీ హీరో కానీ సిద్ధ పడకపోవచ్చు. ఆ టైంలో మనస్పర్థలు రాకుండా తప్పుకుంటారు లేదా మనస్పర్థలు వచ్చాక తప్పుకుంటారు.సరిగ్గా ఇలాగే జరిగిందో.. ఏమో తెలీదు కానీ.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని సినిమాలకు సంబంధించిన దర్శకులు తప్పుకుంటే.. హీరోలే డైరెక్టర్లుగా మారాల్సి వచ్చింది. విశాల్‌ హీరోగా 2017లో ‘డిటెక్టివ్’ (తమిళ్ లో ‘తుప్పరివాలన్‌’) అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మిస్కిన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. తర్వాత ‘డిటెక్టివ్ 2′(‘తుప్పరివాలన్‌ 2’) ను కూడా ప్రకటించారు.

కానీ ఈ చిత్రాన్ని మిస్కిన్ డైరెక్ట్ చేయడం లేదు విశాల్ డైరెక్ట్ చేస్తున్నాడు. వీరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే దీనికి కారణం అని తెలుస్తుంది. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు ..లు దర్శకులుగా మారుతూ లారెన్స్ తో ‘దుర్గ’ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే లారెన్స్ కు ఈ దర్శకులకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్లో అజయ్‌ దేవగన్‌ హీరోగా ‘బోళ’ అనే సినిమా తెరకెక్కుతుంది.

తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ కి ఇది రీమేక్. ఈ చిత్రానికి మొదట ధర్మేంద్ర శర్మ దర్శకుడిగా ఎంపికయ్యాడు.కానీ అజయ్ ఇప్పుడు దేవగన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ కు వచ్చేసరికి విశ్వక్‌ సేన్ హీరోగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్‌’ సినిమా వచ్చింది. వీరి కాంబినేషన్లోనే ‘దాస్‌ కా దమ్కీ’ అనే చిత్రం కూడా ప్రారంభమైంది. కానీ నరేశ్‌ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు…. విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా మారి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తున్నాడు అని వినికిడి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus