Balakrishna, Bobby: బాలయ్య బాబీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ ఆమేనా?

  • June 15, 2023 / 05:58 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. అక్టోబర్ నెల తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బాలయ్య బాబీ కాంబో మూవీలో హీరోయిన్ గా తమన్నాపేరును పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య, తమన్నా కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయితే ఆ సినిమా ప్రత్యేక సినిమాగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాబీ తర్వాత సినిమాతో కూడా భారీ సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా రెమ్యునరేషన్ ప్రస్తుతం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. తమన్నాకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

తమన్నా తాజాగా బాహుబలి మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య సినిమాకు తమన్నా ఎంత తీసుకుంటారో చూడాల్సి ఉంది. వరుసగా సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా తమన్నా నటిస్తుండటం గమనార్హం. తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. తమన్నా కెరీర్ విషయంలో తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఎక్కువకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు కావడం గమనార్హం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus