Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తో స్టార్ హీరో డాటర్!

  • January 6, 2022 / 07:38 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ ఏమాత్రం స్లో అవ్వకుండా నేటి తరం యువ హీరోల కంటే కూడా జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నారు. వీలైనంత వరకు వచ్చే ఏడాదిలో మూడు సినిమాలను విడుదల చేయాలని మెగాస్టార్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా రెండు మూడు నాలుగు నెలల్లోనే ఫినిష్ అయ్యే విధంగా కూడా చర్చలు జరుపుతున్నారు.

ఆచార్య సినిమా దాదాపు అన్ని పనులను పూర్తి చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రాబోతోంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలోపు లూసిఫర్ సినిమాను కూడా పూర్తి చేయనున్నారు. ఇక ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఆ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే విషయంలో కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ అందరితో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం దర్శకుడు బాబీ సీనియర్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. శృతిహాసన్ దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల అందరితోనూ సినిమాలు చేసింది.

ఇక మెగా ఫ్యామిలీ లో కూడా రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కనిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు శృతి హాసన్ ప్రభాస్ సలార్ లో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus