NTR, Buchi Babu: తారక్ కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఆమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినా బుచ్చిబాబు కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని కామెంట్లు వినిపించాయి. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్సైందని సమాచారం.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి జాన్వీ కపూర్ పేరు వినిపించగా ఈ సినిమాకు జాన్వీ ఫిక్స్ కాకపోయినా ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీకి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కే జనగణమణ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎన్టీఆర్ సినిమాకు జాన్వీ కపూర్ ను సంప్రదించారని తెలుస్తోంది.

జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడున్నరేళ్లుగా పరిమితం కావడంతో సినిమాల విషయంలో వేగం పెంచాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు బుచ్చిబాబు మరో సినిమా పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తారక్ వరుసగా రెండు సినిమాల్లో నటించనున్నారు.

ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ కూడా ఈ బ్యానర్ లోనే తెరకెక్కనుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో తారక్ నటిస్తున్నారు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి. సినిమాసినిమాకు ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తారక్ రెమ్యునరేషన్ ను భారీగా పెంచే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus