Ravi Teja, Chiranjeevi: చిరంజీవి – బాబీ సినిమాలో రవితేజ సరసన ఆమెనే!

చిరంజీవి అంటే రవితేజకు చాలా అభిమానం. అలాగే దర్శకుడు బాబి అంటే రవితేజకు చాలా అభిమానం. ఈ రెండిటిలో ఏది కారణమో తెలియదు కానీ చిరంజీవి – బాబి సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు కానీ… సినిమా షూటింగ్‌లో అయితే రవితేజ పాల్గొన్నాడని సమాచారం. అంతేకాదు ఆయనకు జోడీగా నటిస్తున్న హీరోయిన్‌ కూడా షూట్‌లో జాయిన్‌ అయ్యిందట. ఆమె టాలీవుడ్‌ ఎమ్మెల్యే అని సమాచారం.

Click Here To Watch NOW

‘సరైనోడు’ సినిమాలో ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్‌ను చిరు – బాబి సినిమాకు తీసుకున్నారని టాక్‌. ఇందులో రవితేజ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఈ పాత్ర సరసన కేథరిన్‌ నటిస్తోందట. నగరంలోని ప్రముఖ పాతబడ్డ లొకేషన్‌లో ఈ సన్నివేశాల చిత్రీకరణ చేశారట. దీంతో ఈ విషయం బయటికొచ్చింది. ‘సరైనోడు’ తర్వాత ఆమె కెరీర్‌కు ఊపొస్తుందనిపించినా ఆశించినంత పేరు రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతోనైనా వస్తుందేమో చూడాలి.

చిరంజీవి – బాబి సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. ఇందులో చిరంజీవి లుక్‌ పూనకాలు తెప్పించే ఉంటుందని బాబి ఇంతకుముందే చెప్పాడు. సినిమా సెట్స్‌లో చిరంజీవిని చూసినవారు కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి – రవితేజ అన్నాద‌మ్ముళ్లుగా క‌నిపిస్తార‌ని సమాచారం. అయితే ఇది గెస్ట్ రోల్ కాద‌ని, పూర్తిస్థాయి పాత్రే అని భోగట్టా.

చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. గతంలో వచ్చిన లీకుల ప్రకారం అయితే ఈ సినిమాలో చిరంజీవి కూలీ పాత్రలో నటిస్తున్నాడు. అయితే నిజానికి ఆ పాత్ర అండర్ కవర్ కాప్ అని తెలుస్తోంది. ఇంటర్వెల్ సమయానికి చిరంజీవి పోలీస్ అని తెలుస్తుందట. మరోవైపు శ్రీలంక బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం, బాబి.. చిరంజీవిని ఎలా చూపిస్తారనేది చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus