Nazriya: సినిమాల విషయంలో అదే ముఖ్యమన్న నజ్రియా!

  • June 8, 2022 / 01:07 PM IST

సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా చాలా విషయాలలో ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే భిన్నమనే సంగతి తెలిసిందే. రాజా రాణి అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నజ్రియా అంటే సుందరానికి సినిమాతో స్ట్రెయిట్ తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ వచ్చినా నజ్రియా వదులుకున్నారు. అంటే సుందరానికి ప్రమోషన్స్ లో భాగంగా నజ్రియా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

కథ నచ్చితే భర్త ఫహద్ ఫాజిల్ తో కలిసి నటించడానికి తాను సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు. వెరైటీ కథాంశం ఉంటే నటించడానికి తనకు అభ్యంతరం లేదని నిజ జీవితంలో భార్యాభర్తలం కాబట్టి సినిమాలలో కూడా అదే విధంగా కనిపిస్తే థ్రిల్ ఏం ఉంటుందని నజ్రియా చెప్పుకొచ్చారు. కథ నచ్చితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు. మంచి సినిమాలలో నటించాలని తాను కోరుకుంటున్నానని స్టార్ హీరోయిన్ గా ఉండాలని తాను భావించడం లేదని నజ్రియా కామెంట్లు చేశారు.

వివాహం అనంతరం నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని అంటే సుందరానికి సినిమాలో నటించానని నజ్రియా కామెంట్లు చేశారు. నాని డెడికేషన్ తనకు ఎంతగానో నచ్చిందని ఆమె తెలిపారు. నాని సెట్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడని ఆమె చెప్పుకొచ్చారు. కథ నచ్చితే తాను హీరో ఎవరనే విషయాన్ని కూడా పట్టించుకోనని ఆమె కామెంట్లు చేశారు.

తాను కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లోనే ఎక్కువగా నటించానని నజ్రియా అన్నారు. అంటే సుందరానికి సినిమాలో క్రిస్టియన్ యువతి పాత్రలో ఆమె నటించారు. ఈ సినిమాతో నాని, నజ్రియా సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus