Kollywood: వరుస కడుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు.. గుడ్ వైబ్ కదా..
- September 9, 2026 / 07:33 PM ISTByFilmy Focus Desk
తెలుగులో అన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కడున్నాయి.. మనవాళ్లు పెద్దగా తీయడం లేదు కదా అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది నిజమే. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే సినిమాలు లిస్ట్ తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించింది. ఆ సినిమాలు మన ప్రేక్షకుల ప్రేమ (?)ను కొల్లగొట్టడానికి తెలుగులో అనువాదం జరుపుకుని మరీ వస్తాయి కాబట్టి.. మనం కూడా ఓ లుక్కేస్తే సమాచారం ఉంటుందని చెబుతున్నాం.
Kollywood
కోలీవుడ్ ఎప్పటిలానే కొత్త రకం కథలతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో నాయికా ప్రాధాన్య చిత్రాలను కూడా చేస్తుంటారు. అలా ప్రస్తుతం తమిళ సినిమాలో మొత్తం నాలుగు వుమన్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందుతున్నాయి. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘మంజనాతి’. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రధారి. యువ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ‘PR Show’ పేరిట సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ఇటీవల ప్రారంభించారు.
ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మొదటి చిత్రంలో యంగ్ బ్యూటీ మమితా బైజు, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆరుగురు దర్శకులు కలసి రూపొందిస్తున్న ఈ సినిమా వైవిధ్యంగా ఉండబోతోంది అని ఇటీవల రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో చెప్పకనే చెప్పింది. అలాగే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తోంది. ఇందులోనూ ప్రియాంక మోహన్‌దే ముఖ్య పాత్రలో నటిస్తోంది.
సీనియర్ హీరోయిన్ త్రిష, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ అపర్ణా బాలమురళి ‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమా ఫేమ్ రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఇవి కాకుండా మరికొన్ని తమిళ సినిమాలు, స్టార్ నటులు ఇలాంటి సినిమాలకు ఓకే చెబుతున్నారు. త్వరలోనే వీటి విషయంలో క్లారిటీ వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ తెలుగులో కూడా వస్తాయి.














