NTR: ఎన్టీఆర్ 30 ఆ హీరోయిన్ లేనట్లే?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ మూవీ పై అంచనాలు అయితే మాములుగా లేవు. ఈ ప్రాజెక్ట్ పెద్ద కాన్వాస్ ఉన్న కథ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించడానికి అగ్ర హీరోయిన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఆ మధ్య చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా అలియా భట్ ను కూడా ఫైనలైజ్ చేసినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

అయితే ఆ విషయంపై అలియా కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ ఆమె తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఈ ప్రాజెక్టులో ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అనే విషయంలో అయితే ఇంకా క్లారిటి రాలేదు. కానీ దర్శకుడు కొరటాల శివ మాత్రం వీలైనంత త్వరగా ఒకరిని ఫైనల్ చేయాలి అని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్ని కూడా పూర్తయ్యాయి.

ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 వ తేదీన అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో శ్రద్ధా కపూర్ కూడా నటించబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ బ్యూటీ ప్రస్తుతం మిగతా సినిమాలతో చాలా బిజీగా ఉంది. మరో వైపు కొరటాల శివ ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఆలియా భట్ శ్రద్ధా కపూర్ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టులో లేరు అని తెలుస్తోంది. మధ్యలో సాయిపల్లవి కూడా మరొక ముఖ్యమైన పాత్ర కోసం సెలక్ట్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ అందులో కూడా ఇలాంటి క్లారిటీ లేదు. మరి ఈ ప్రాజెక్టులో దర్శకుడు కొరటాల శివ ఏలాంటి హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి. ఇక ప్రాజెక్ట్ లోని కథలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus